ప్రియమైన జననేత,
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం 🙏
బలిదానాల తో స్వాతంత్రం - స్వదేశీ పాలకులతో దోపిడి గా రూపాంతరం.
200 సంవత్సరాలు బ్రిటిష్ వారిచే దోపిడికి గురైన నా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయ్యింది అని మనం చెబుతున్నాం.
గత 79 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి దోపిడి మరియు నా దేశ ప్రజల హక్కుల హననం రూపాంతరం చెంది ఈ దేశ రాష్ట్ర నాయకుల దోపిడి, హక్కుల హననంగా మారిపోయాయి.
ప్రజల పట్ల నిర్లక్ష్యం రోజురోజుకు రెట్టింపు అవుతూ చివరకు ఆ దోపిడి చేసే వాళ్లే చట్టసభల్లో కూర్చుని దోపిడిని న్యాయబద్ధం చేసే స్థాయికి దేశ రాష్ట్ర రాజకీయాలు దిగజారాయి.
ఎంతలా పరిస్థితి మారిపోయింది అంటే — నా దేశంలో తల్లి తండ్రులు వారి పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి రాజకీయాలను ఒక విషంలా చూపిస్తూ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్దేశిస్తున్నారు.
కాల క్రమేణ రాజకీయాలను ఒక వర్ణానికి లేదా రెండు మూడు వర్గాలకు మాత్రమే సొంతమైన వ్యవస్థగా మార్చేశారు.
"నా హక్కు తొక్కబడినప్పుడు, నా మనుగడనే ప్రశ్నార్థకం చేసినప్పుడు – నాకు యుద్ధమే శరణ్యం. స్వేచ్ఛ కోసం చేసే యుద్ధంలో నేను మరణించినా నేను విజేతనే."
— చే గువేరా
ఉద్యమాలు — అణచివేతలో చిక్కుకున్న గొంతులు
ఈ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న కమ్యూనిస్టు ఉద్యమాలను కూడా ఈ అవినీతి రాజకీయ నాయకులు మీడియా నియంత్రణ ద్వారా ప్రజల మనస్సులను వక్రీకరించి కమ్యునిజం సోషలిజాన్ని తాలూకు భావజాలాన్ని సమూలంగా నిర్వీర్యం చేశారు.
ఇక పోతే ఉద్యమ బాటలో ప్రాణాలను లెక్కచేయకుండా, సుఖాలను పక్కన పెట్టి అడవి దారి పట్టిన నక్సలైట్లు, మావోయిస్టులను కూడా MLA, MP దోపిడీలకు అడ్డుగా ఉన్నారని ఎన్కౌంటర్లు పేరుతో చంపుతుంటే...
ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష దోపిడీలను నిశితంగా పరిశీలిస్తూ, దోపిడి ఎలా చేయాలో నైపుణ్యం పెంచుకుంటూ ఉంటే —
వీళ్ల ముందు బ్రిటిష్ వాళ్లు దేవుళ్లలా కనిపించే పరిస్థితి వచ్చింది.
చీకటిలో ఆశాకిరణం — జనసేన ఆవిర్భావం
రాజ్యాంగానికి అసలైన శక్తి ప్రతిపక్ష పాత్రలోనే ఉంటుంది. అలాంటిది అప్పుడే అడ్డదిడ్డంగా రెండు ముక్కలు చేసిన ఆంధ్రప్రదేశ్ — మన తెలుగు తల్లి కన్నీటితో రోదిస్తున్న సమయంలో వినిపించిన ఒకే ఒక్క గొంతు:
"జనసేన — ఇది సామాన్యుడి సేన. ✊"
ఈ తరం యువతను రాజకీయాల గురించి ఆలోచింపజేసిన పార్టీ — జనసేన.
ఓటుకు నోటు ఒక హక్కులా మారిపోయిన సమయంలో అది చట్టవిరుద్ధం అని చెప్పి, గత దశాబ్దాలుగా మా ఓట్లను సంతలో గొర్రెల్లా కొంటున్నారని మాకు అర్థమయ్యేలా చేసిన నాయకుడు మీరు.
మధ్యతరగతి బాధలు అణిచివేత - జనసేన ధైర్యం & తిరుగుబాటు
ప్రజా సమస్యల మీద ప్రభుత్వ అధికారులకు అర్జీలు ఇవ్వవచ్చు అని, మన స్థానిక సమస్యలను మనమే స్థానిక ప్రభుత్వ అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించుకోవాలి అని మీరు చెప్పినప్పుడు మాకు ఒక కొత్త అవగాహన వచ్చింది.
దశాబ్దాలుగా ప్రతి చిన్న ప్రభుత్వ కార్యాలయంలో పని కోసం స్థానిక నాయకుడి చుట్టూ తిరిగి బ్రతిమలాడి వారి గుమ్మాల ముందు నిలబడి, వారు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలి అనే పరిస్థితి ఉండేది.
అలాంటి పరిస్థితిలో ఉన్న మా లాంటి మధ్యతరగతి కుటుంబాలకు మీరు ఇచ్చిన ధైర్యంతో మేము మొదటిసారి స్థానిక నాయకుడు లేకుండానే — స్థానిక సమస్య, అది స్థానిక నాయకుడే కారణమైన సమస్య అయినా సరే — నేరుగా స్థానిక ప్రభుత్వ అధికారికి అర్జీ ఇవ్వగలిగాము.
"అది నిజంగా ప్రజాస్వామ్యాన్ని బలపరిచే ఒక పెద్ద మార్పు. దశాబ్దాలుగా బానిసత్వ గోడలను బద్దలు కొట్టిన సంఘటన."
మీరు పార్టీ స్థాపించి రాజ్యాంగ భావజాలాన్ని పార్టీ ద్వారా మాకు పంచినప్పుడే — మీరు ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా గెలిచారు.
కళ్యాణ్ గారికి ఒక జనసైనికుడి విన్నపం
ఫీడ్‌బ్యాక్ విధానం
అధిష్టాన నాయకత్వానికి గ్రౌండ్ స్థాయి కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ లేకపోతే నిజమైన పరిస్థితి అధిష్టానానికి కనిపించదు.
జనసైనికులు దశాబ్దాలుగా ఎన్నో పెద్ద సమస్యలపై పోరాటాలు చేశారు. అవి సాధారణ సమస్యలు కాదు — నాయకత్వం దృష్టికి తప్పనిసరిగా చేరాల్సిన సమస్యలు.
కానీ ఇప్పుడు ఆ సమస్యలు మీ వరకు తీసుకువచ్చే స్పష్టమైన మార్గం లేకపోవడం నిజంగా జనసైనికుల దురదృష్టం.
ప్రతిజ్ఞలు మరియు వాస్తవం
మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన మా లాంటి యువకులకు అప్పులు, బాధలు మరియు అణిచివేతలు ఎక్కువ. అయినా కూడా ఆ బాధ్యతల మధ్య సమయం కేటాయించి మేము గొంతెత్తి ప్రజా సమస్యలపై పోరాటాలు చేశాము.
అప్పుడు మేము ప్రజల మధ్య చెప్పిన మాట ఒకటే — "మేము అధికారంలోకి వస్తే ఈ సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపుతాము అని"
కానీ ఇప్పుడు ఒక బాధాకరమైన వాస్తవం కనిపిస్తోంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మా గొంతు మూగబోయినట్టుగా అనిపిస్తోంది.
పార్టీ నిర్మాణ రీఫార్మ్
అధికారం మరియు శక్తి విభజన
పొత్తు ద్వారా అధికారంలోకి వచ్చిన మనం, మన పార్టీ ప్రాథమిక హక్కు అయిన పవర్ షేరింగ్ లో కూడా ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించలేదు.
మమ్మల్ని చూసి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు మా పరిస్థితి చూసి ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో జనసేనకు దక్కిన నామినేటెడ్ పదవుల్లో చాలా మంది నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన నాయకులు కాకుండా, ప్రజలకు దూరంగా AC గదుల్లో పని చేస్తూ జీతాలు తీసుకుంటున్న నాయకులకు దక్కినట్లు కనిపిస్తోంది.
నాయకత్వం ఎంపిక
రాకరాక వచ్చిన ఈ అవకాశంలో ఉద్యమాల ద్వారా ఎదిగిన అర్హులైన జనసేన నాయకులు ఎంతో మంది ఉన్నా — వారు మీ దృష్టిలో లేకపోవడం పార్టీ పారదర్శకతపై సందేహాలు కలిగిస్తోంది.
"సామెత: "చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇళ్లు అయినట్టు.""
సామాన్యులు తమ పాకెట్ మనీ పెట్టుబడిగా పెట్టి నిర్మించిన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ సామాన్యులు కాకుండా పెద్దవారు ముందుకు వచ్చి పదవులు పొందడం బాధాకరం.
ఇంకా ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే — రాష్ట్రంలో జనసేన నాయకులపై దాడులు జరిగినా, గాయపడినా వారిని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
పార్టీ బలోపేతానికి కీలక సూచనలు
పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలపరచడానికి ఈ క్రింది మార్పులు తక్షణమే అవసరం:
- కమిటీల రద్దు:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలను రద్దు చేయాలి.
- ఇన్‌చార్జ్ నియామకం:ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జ్‌ను నియమించాలి.
- జోనల్ హెడ్ వ్యవస్థ:నియోజకవర్గాల నుండి వచ్చే సమస్యలను సమీక్షించే విధంగా జోనల్ హెడ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
- డైరెక్ట్ రిపోర్టింగ్:జోనల్ హెడ్‌లు సేకరించిన నివేదికలు నేరుగా మీకు చేరే విధంగా వ్యవస్థ ఉండాలి.
- మిత్రపక్ష సమన్వయం:TDP రాష్ట్ర కార్యాలయం నుండి వారి ఎమ్మెల్యేలకు అధికారికంగా జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో కలిసి పనిచేయాలని సూచించే లేఖ ఇవ్వాలి.
విప్లవం మరియు మార్పు
కాలంతో పాటు మార్పు అవసరం.
"The devil always lies in the intention."
— డాక్టర్ బి.ఆర్. అంబేడ్‌కర్
మీరు నడిచే దారి మాకు రహదారి. మీ నినాదం ఏదైనా మాకు ఆనందమే.
"ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ లాంటి డబ్బు, పదవి వ్యామోహం లేని నాయకుడు ఇప్పటివరకు రాలేదు — భవిష్యత్తులో కూడా రావడం కష్టం."
అలాంటి నాయకత్వం మరింత బలంగా ఉండాలని ఒక సాధారణ జనసైనికుడిగా కోరుకుంటున్నాను.
ఈ లేఖ అసహనం కాదు.
ఈ లేఖ తిరుగుబాటు కాదు.
ఈ లేఖ నేల గొంతు.
ఈ లేఖ నమ్మకం మిగిలి ఉన్నందుకే రాసిన విన్నపం.
విప్లవం వర్దెల్లాలి
జై హింద్ జై జనసేన ✊